![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -51 లో.....శకుంతల వినాయకుడికి మొక్కుకొని గంగకి కొబ్బరికాయ ఇచ్చి రుద్రకి ఇవ్వమని చెప్తుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగ కొబ్బరి కాయ తీసుకొని వచ్చి రుద్రకి ఇస్తుంది. రుద్ర కొబ్బరికాయ కొడుతాడు. ఆ తర్వాత వీరు డిస్సపాయింట్ గా ఫీల్ అవుతుంటే అప్పుడే ఇషిక వచ్చి మాట్లాడుతుంది. మెల్లగా అత్తయ్యకి రుద్ర బావపై కోపం పోతుందని వీరూతో ఇషిక చెప్తుంది.
ఇక రుద్ర బావ ఒక్కడే ఈ ఆస్తులని ఏలుతాడని ఇషిక అంటుంది. మరుసటి రోజు ఉదయం.. రుద్రతో పాటు గంగ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. రుద్ర క్యాబిన్ లోకి గంగ తనతో పాటు వెళ్తుంటే.. ఎక్కడికి నీకు ఒక చైర్ వేయమంటావా అని వెటకారం గా మాట్లాడతాడు. దాంతో గంగ కోపంగా రుద్రని తిట్టుకుంటుంది. గంగ వెనక్కి చూసేసరికి రుద్ర ఉంటాడు. గంగ భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ కి బదులు కల్తీ ఆయిల్ ని ఎవరో మార్చారని మక్కంని కంప్లైంట్ ఇవ్వమంటాడు రుద్ర. పోలీసులు ఎంక్వయిరీ కి వస్తారు. వీరు తన ప్లాన్ లో భాగంగా తన మనిషితో గంగ బ్యాగ్ లో కల్తీ ఆయిల్ ప్యాకెట్ పెట్టిస్తాడు. పోలీసులు అందరి బ్యాగ్ లు చెక్ చేస్తుంటే గంగ బ్యాగ్ లో కల్తీ ఆయిల్ పాకెట్స్ దొరుకుతాయి.
ఇలా చేశావేంటి గంగ అని వీరు అంటాడు. నాకు ఇప్పుడు అర్థం అయింది.. ఇలా చేస్తారని తెలిసే గంగని తీసుకొని వచ్చారు.. ఎవరో ప్లాన్ ప్రకారం గంగని ఇరికించి మా పేరుని దెబ్బ కొట్టాలనుకున్నారు ఎస్ ఐ గారు.. ఆ అమ్మాయి అలాంటిది కాదని పోలీసులకి రుద్ర చెప్తాడు. సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ రీకలెక్ట్ చెయ్యండి అని పోలీసులకి చెప్తాడు రుద్ర. తరువాయి భాగంలో ఇందుమతి తన నగలు పోయాయని పైడిరాజుపై డౌట్ పడుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |